తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు అందుకుంటారు. మరి కొంతమంది ఎంత నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోతారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు శ్రీ విష్ణు ఒకరిని చెప్పవచ్చు. శ్రీ విష్ణు తెలుగులో అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

ఇక హీరోగా గాలి సంపత్, రౌడీ సర్కార్, మా అబ్బాయి, ఉన్నది ఒకటే జిందగీ, అల్లూరి, అర్జున ఫాల్గుణ, బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో, ఓం బీమ్ బుష్ ,రాజరాజచోర, సామజవరగమన, బల తందనాన లాంటి అనేక సినిమాలలో సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఆగ్ర హీరోలలో శ్రీ విష్ణు ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా శ్రీ విష్ణు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరిగా నిలవడం విశేషం. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన బ్రోచేవారెవరురా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం ఈ హీరోకు వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం లాంటి సినిమాలలోను అవకాశాలు రావడం విశేషం.

ఇదిలా ఉండగా....ప్రస్తుతం ఈ హీరో నటించిన తాజా చిత్ర స్వాగ్. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం హీరో శ్రీ విష్ణు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోటీన్ సినిమాలు చేయడం తనకు అస్సలు నచ్చదని అన్నారు. కొత్త తరహా సినిమాలే చేస్తానని విష్ణు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని హీరో శ్రీ విష్ణు తెలిపారు. స్వాగ్ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు వచ్చాయని వెల్లడించాడు. ఇక ఈ హీరో నటించిన సింగిల్ మూవీ తాజాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: