
ఇంతమంది పిల్లలను చదివించడమే సాధారణం కాదు. ప్రభాస్ తన మంచితనంతో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. సంపాదించిన మొత్తాన్ని దాచుకోకుండా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ మరింత కష్టపడితే కెరీర్ పరంగా మరిన్ని రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ అయ్తే ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ కెరీర్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఇతర హీరోలకు భిన్నంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ ఈ ఏడాది రెండు సినిమాలను వచ్చే ఏడాది రెండు సినిమాలను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు.