టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ దక్కింది. దానితో ఈ సినిమాకి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

12 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 17.48 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.89 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.90 కోట్లు , ఈస్ట్ లో 1.98 కోట్లు , వెస్ట్ లో 2.69 కోట్లు , గుంటూరులో 2.72 కోట్లు , కృష్ణలో 2.44 కోట్లు , నెల్లూరులో 1.26 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 12 రోజుల్లో 38.53 కోట్ల షేర్ ... 67.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని ఈ మూవీ కి 6.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఇతర భాషలలో 1.92 కోట్లు , ఓవర్సీస్ లో 12.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 59.47 కోట్ల షేర్... 112.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 48.90 కోట్ల బరియ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే 9.47 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: