బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ ఒకరు. ఈ భామ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2015 సంవత్సరంలో "దామ్ లాగ కె హైసా" సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన ఈ చిన్నది హిందీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. 

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా భూమి పెడ్నేకర్ తన కెరీర్ కొనసాగించింది. రీసెంట్ గానే భూమి "ది రాయల్స్" వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ మే 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ది రాయల్స్ వెబ్ సిరీస్ లో తన కన్నా ఆరేళ్లు చిన్నవాడైనా ఇషాన్ కట్టర్ తో రొమాన్స్ చేయడంతో ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. తనకన్నా చిన్నవాడితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం అస్సలు బాగోలేదని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

దీనిపై భూమి పెడ్నేకర్ తాజాగా స్పందించారు. వయసులో చిన్నవాడైతే రొమాన్స్ చేయకూడదా అని ప్రశ్నించారు. మా ఇద్దరికి కంఫర్ట్ అనిపించింది కాబట్టే ఇందులో నటించాం, రొమాంటిక్ సన్నివేశాలను చేశాం. షూటింగ్ కు ముందే మేమిద్దరం ఒకరి గురించి మరొకరం బాగా తెలుసుకున్నాం చాలా క్లోజ్ అయ్యాం. బాగా క్లోజ్ అయిన తర్వాతనే రొమాంటిక్ సన్నివేశాలలో నటించామని భూమి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ మాట్లాడిన ఈ మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీనిపై పలువురు నేటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: