హిట్ యూనివర్స్ లో భాగంగా ఇటీవల విడుదలైన `హిట్ 3` చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో హీరోగా, నిర్మాతగా కూడా నాని సక్సెస్ అయ్యాడు. ఆ సంగతి పక్కన పెడితే.. `హిట్ 2` లో ఏఎస్పీ వర్షాగా అలరించింది కోమలి ప్రసాద్. ఆమె క్యారెక్టర్ హిట్ 3 లో కూడా కొనసాగింది. ఈసారి డైరెక్టర్ శైలేష్ కొలను ఆమె పాత్రను హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దారు. దాంతో కోమలి ప్రసాద్ కు మంచి గుర్తింపే ద‌క్కింది.


ఈ క్రమంలోనే కోమ‌లి ప్ర‌సాద్ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? వంటి విషయాలు తెలుసుకునేందుకు సినీప్రియలు ఉత్సాహం చెబుతున్నారు. పెరిగింది కర్ణాటకలోనే అయినా కోమ‌లి ప్రసాద్ అచ్చ తెలుగు అమ్మాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఆమె జన్మించింది. 29 ఏళ్ల ఈ సుందరి.. సినిమాల్లోకి రాకముందు ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ పూర్తి చేసింది. కొన్నాళ్లు డెంటిస్ట్ గా కూడా పనిచేసింది.


అలాగే కోమలి ప్రసాద్ నేషనల్ లెవెల్ అథ్లెట్, రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి.. అలాగే విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాట్మెంటన్ లో ఎన్నో బంగారు పథకాలను గెలుచుకుంది. మరోవైపు క్లాసికల్ నృత్యంలోనూ శిక్షణ పొందింది. మల్టీ టాలెంటెడ్ అయిన కోమలి ప్రసాద్‌.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో 2016లో `నేను సీత దేవి` అనే తెలుగు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా ద్వారా ఆమెకు అంతగా గుర్తింపు రాకపోయినా.. ఆ మరుసటి ఏడాది `నెపోలియన్` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత `అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి`, `రౌడీ బాయ్స్`, `సెబాస్టియన్ పి.సి.524`, `హిట్ 2`, `హిట్ 3` త‌దిత‌ర చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇటీవ‌ల `టచ్ మీ నాట్` అనే వెబ్ సిరీస్ తోనూ ప‌ల‌క‌రించింది. హిట్ యూనివ‌ర్స్ లో భాగం కావ‌డంతో న‌టిగా కోమ‌లి ప్ర‌సాద్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: