- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సినిమా అంటేనే ఇప్పుడు ఓ జూదం అయిపోయింది. సినిమా హిట్ అయితే పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు అయినా రావచ్చు.. కానీ ప్లాప్‌ అయితే
ఉన్నదంతా ఊడుచుకుని పోవచ్చు. ఇప్పుడు ఈ జూదంలో అతిపెద్ద ఆట ఆడేందుకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వీళ్ళు సినిమా ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ సినిమా రెమ్యునరేషన్ .. సినిమా బడ్జెట్ ఎలా ఉంటుందో ? అందరికీ తెలిసిందే. అలా తీసిన సినిమా హిట్ అయితే ఓకే.. ప్లాప్ అయితే మాత్రం కనీవిని ఎరుగని నష్టాలు చూడాల్సి వస్తుంది. గతంలో వచ్చిన పేట - అన్నాతే లాంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఇదే టైంలో సినిమా హిట్ అయితే దాన్ని రేంజ్ కూడా ఊహించడం కష్టం. ఉదాహరణకు జైలర్ సినిమా.


రజనీకాంత్ సినిమా వ్యవహారం ఏసీ డీసీ టైపులో ఉంటుంది. ఇప్పుడు ఈ రేసులోకి మైత్రి వచ్చి చేరింది. ఇన్నాళ్లు లైకా - సన్‌ పిక్చర్స్ మాత్రమే రజనీకాంత్ తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ బిగ్ లీగ్‌ లోకి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎంటర్ అయింది. మైత్రికి రజనీకాంత్ ఓ సినిమాకు సంతకం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరు అనేది ? ఇంకా నిర్ణయించలేదు. సినిమాతో కోలీవుడ్లో ఎంటర్ అయింది మైత్రి మూవీస్. ఈ సినిమా ఓ మోస్త‌రుగా ఆడింది. మైత్రి వాళ్లకు స్వల్ప నష్టాలు వచ్చాయి .. అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ప్లాన్ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: