కొన్ని సంవత్సరాల క్రితం సుమంత్ హీరో గా కమలిని ముఖర్జీ హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 2006 వ సంవత్సరం మే 19 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 19 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 19 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యం లో ఈ మూవీ కి ఆ సమయం లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి గోదావరి మూవీ కి నైజాం ఏరియాలో 92 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 72 లక్షలు , ఉత్తరాంధ్ర లో 83 లక్షలు , ఈస్ట్ లో 37 లక్షలు , వెస్ట్ లో 29 లక్షలు , గుంటూరులో 44 లక్షలు , కృష్ణ లో 39 లక్షలు , నెల్లూరు లో 13 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 4.09 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.12 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి ఫైనల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 5.21 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 4.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.21 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ దాదాపు ఒక కోటి లాభాలను అందుకొని ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: