చెంబోలు సీతారామశాస్త్రి అంటే ఎవరికీ తెలియదేమో కానీ, సిరివెన్నెల అనగానే అసలు ఆ సినిమా కన్నా ముందుగా మెదిలేది ఆ సీతారామశాస్త్రే , శాస్త్రి గారు "ఆదిభిక్షువు వాడినేది అడిగేది.. బూడిదిచ్చేవాడినేది అడిగేది " అని పేరుకైతే అన్నాడు కానీ, ఆ శివుడు మాత్రం నందిని పదకొండు సార్లు శాస్త్రి వారింటికి పంపించాడు. విధాత తలుపున ప్రభవించిన ఒకానొక అక్షరమూర్తి ఈ శాస్త్రుల వారు. అందరికి ఈయన ఇనస్పిరేషన్ సాంగ్స్ నచ్చుతాయు అంటారు కానీ, నాకు వాటితో పాటు ఈయన రొమాంటిక్ సాంగ్స్ , నాకు అన్నిటికన్నా నచ్చింది అంటే " పూల రెక్కలు..... కొన్న. తేనె చుక్కలు రంగరిస్తివో, ..ఇలా బొమ్మ చేస్తివో .. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా..కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా " అసలు ఒక అమ్మాయిని ఇంతకన్నా ఎవరైనా పొగడగలరా !!


“వెయ్యినొక్క జిల్లాలవరకు వింటున్నాం నీ కీర్తినే, ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే...:  ఈ రేంజ్ లో  ఫ్లర్ట్ చేస్తే ఏ అమ్మాయైనా పడక చస్తుందా.. ! "కుర్రకళ్ళు చీరగళ్ళ లో దారే లేక వెతుకుచున్నవి...".ఎంత రొమాంటిక్ మెటఫర్. "నీవే లేని నిమిషాలన్నీ నిషేదాంచనా " వాట్ ఎ లవ్లీ ఫీల్ .. అందుకే నాకు  సీతారామశాస్త్రి లో ఈ రొమాంటిక్ యాంగిల్ నచ్చేస్తుంది... ఆయన జయంతి రోజున ఆయన ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోయినా .. ఆయ‌న క‌లం నుంచి జాలు వారిన వేలాది పాట‌లు మాత్రం మ‌న‌తో ఎప్ప‌ట‌కీ అలాగే ఉండిపోతాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: