టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీతో హీరో గా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న  కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయ్యాడు. అలాగే రాజా వారు రాణి గారు సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే రవి కిరణ్ , విజయ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు , అందులో భాగంగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించబోయే హీరోయిన్ను కూడా రవి కిరణ్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు , ఇప్పటికే కీర్తి సురేష్ ... విజయ్ , రవి కిరణ్ కాంబోలో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కెరియర్ ప్రారంభంలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటించిన కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. మరి విజయ్ , రవి కిరణ్ కాంబోలో తెరకక్కబోయే సినిమాలో ఈ బ్యూటీ నిజం గానే హీరోయిన్గా సెలెక్ట్ అయితే ఆ సినిమాలో ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తుందా ... లేక క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో కనిపిస్తుందా అనే ఆసక్తి జనాల్లో బాగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd