పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ చరణ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. పవన్ చరణ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ కాంబోలో సినిమా వస్తే సినిమా సంచలనం అవుతుంది.
 
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు దక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు రెమ్యునరేషన్ల పరంగా ఒకింత టాప్ లో ఉన్నారు. పవన్, చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
పవన్, చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఒక్కో మెట్టు ఎదిగి కెరీర్ పరంగా ఈ స్థాయికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ సరైన సినిమాలను ఎంచుకుంటే అతని కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా సినిమాల్లో కెరీర్ కొనసాగిస్తానని వెల్లడించారు.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ సైతం 80 కోట్ల రూపాయలకు చేరిందని వైరల్ అవుతున్న వార్తల సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తే ఆ ఇమేజ్ పొలిటికల్ గా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కేంద్ర స్థాయిలో చక్రం తిప్పాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: