
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా పవన్ సినిమాలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. పవన్ ను తొక్కేయాలని కుట్ర చేస్తోందెవరు అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాలకే ఎందుకిలా జరుగుతోందంటూ అనుమానాలను సైతం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు విషయంలో నిజంగానే కుట్ర జరిగింది.
పవన్ ఇంత ఘాటుగా స్పందించారంటే ఆయన ఊరికే స్పందించరని ఇండస్ట్రీలోని వాళ్లకు సైతం తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగ, సినిమాల రేంజ్ తగ్గించేలా వ్యవహరించడం వల్ల బెనిఫిట్ పొందేదెవరు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యవహారాలపై మరింత దృష్టి పెట్టి డబుల్ గేమ్ ఆడుతున్న వాళ్లకు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.