ఏంటి రణవీర్ సింగ్ దీపికా పదుకొనేకి అన్యాయం చేసి ఆ స్టార్ హీరో కూతురుతో డేటింగ్ చేస్తున్నారా.. ఇది నిజమేనా.. ఇంతకీ దీపికా రణవీర్ సింగ్ ల మధ్య ఏం జరిగింది..దీపికను పక్కనపెట్టి ఆ స్టార్ హీరో కూతురితో రణవీర్ సింగ్ డేటింగ్ చేయడానికి కారణం ఏంటి అనుకుంటారు ఈ టైటిల్ చూసిన చాలామంది. మరి ఇంతకీ రణవీర్ సింగ్ దీపిక పదుకొనేల మధ్య చిచ్చు ఎక్కడ మొదలైంది..వీరిద్దరి మధ్య నిజంగానే మనస్పర్ధలు వచ్చాయా.. ఇన్ని రోజులు అన్యోన్యంగా ఉన్న వీరి సంసారంలో నిజంగానే చిచ్చుపెట్టారా అనేది ఇప్పుడు చూద్దాం. రణవీర్ సింగ్ దీపిక పదుకొనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు ఈ ఇద్దరు చాలా మంది నటీనటులతో డేటింగ్ చేసినప్పటికీ ఫైనల్ గా ఈ జంట ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిన కొద్ది సంవత్సరాల వరకు వీరికి పిల్లలు లేరు. 

అలాగే ఇద్దరి మధ్య తరచూ గొడవలు వస్తున్నట్లు కూడా రూమర్లు వినిపించాయి. దాంతో చాలాసార్లు రణవీర్ సింగ్ దీపిక పదుకొనే లు విడిపోతున్నట్టు వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలన్నీ పుకార్లే అని కొట్టి పారేస్తూ ఫైనల్ గా దీపికా పదుకొనే రణవీర్ సింగ్ లు ఒక పాపకు జన్మనిచ్చారు.గత ఏడాది పండంటి పాపకు జన్మనిచ్చిన దీపిక పదుకొనే ప్రస్తుతం కూతురి ఆలనా పాలన చూసుకుంటుంది. త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.ఈ విషయం పక్కన పెడితే తాజాగా రణవీర్ సింగ్ దీపిక పదుకొనేకు అన్యాయం చేసి ఆ స్టార్ హీరో కూతురితో డేటింగ్ చేస్తున్నట్టు బీ టౌన్ లో ఒక రూమర్ వినిపిస్తుంది.అయితే ఇది నిజమే అనుకుంటే పొరపాటు పడ్డట్లే.

ఎందుకంటే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో..ప్రస్తుతం రణవీర్ సింగ్ స్టార్ నటుడు అయినటువంటి సంజయ్ కపూర్ కూతురు శనయా కపూర్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారట. ప్రస్తుతం సంజయ్ కపూర్ కుమార్తె విక్రాంత్ మస్సే డైరెక్షన్ లో ఆంఖోన్ కీ గుస్తాకియాన్ అనే సినిమాలో చేస్తోంది. త్వరలోనే రణవీర్ సింగ్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటించబోతున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట.అయితే బాలీవుడ్ లో ఉన్న చాలా మంది దర్శక నిర్మాతలు కొత్త తరాన్ని తీసుకురావాలని చూస్తారు. అలా రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోతో సంజయ్ కపూర్ కుమార్తె నటిస్తే మాత్రం ఆమెకు స్టార్డం రావడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: