పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా థియేటర్లను మూసేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ లో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజుతో సహా మరి కొంతమంది నిర్మాతలు హాజరయ్యారు. డిస్ట్రి బ్యూటర్లు టికెట్ల ధరలు పెంచాలని లేకపోతే థియేటర్లను మూసేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది భాగస్వాములు అయ్యారంటూ అనేకమైన ఆరోపణలు వచ్చాయి. 


ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సిటీ జనసేన ఇన్చార్జ్ అత్తి సత్యనారాయణను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలిసేంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా థియేటర్ల బంద్ వెనక ఎవరు ఉన్న అసలు ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ ఇదివరకే అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల నిర్వహణపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ Dy.CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు దారి చేశారు.


 ప్రేక్షకులు కుటుంబంతో కలిసి థియేటర్లకు రావాలంటే టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలని పవన్ కళ్యాణ్ అన్నారు. టికెట్లు ధరల పెంపకం కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాలను సంప్రదించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. థియేటర్ల బంద్ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని రీసెంట్ గానే నిర్మాత దిల్ రాజు స్పందించారు. హరిహర వీరమల్లు సినిమాతో సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: