యాంకర్ అనసూయ ఏ విషయాన్నైనా సరే చాలా ఓపెన్ గా చెబుతూ బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది.అయితే అలాంటి అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఆ మాటలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది అనసూయ భరద్వాజ్ మాత్రం ఓపెన్ గానే అలాంటి విషయాలను చెప్పడంతో చాలామంది అనసూయ మాటలకి షాక్ అయిపోతున్నారు. ఇదేంటి ఈ యాంకర్ మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుంది అంటూ అనసూయ మాటలకి కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకీ అనసూయ మాట్లాడిన ఆ మాటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ జబర్దస్త్ తో యాంకర్ గా మారింది.ఆ తర్వాత పలు షోలు చేస్తూ యాంకర్ గా బిజీ అయిన తర్వాత కొన్ని సినిమాల్లో కీ రోల్స్ పోషించింది.ముఖ్యంగా రంగస్థలం, విమానం,పుష్ప-2 సినిమాతో అనసూయ భరద్వాజ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ చేస్తూ యాంకరింగ్ పూర్తిగా మానేసి సినిమాల్లోనే కొనసాగుతోంది.అయితే అలాంటి అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చీర కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం.  చీర కట్టుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి.ముఖ్యంగా చీర కట్టుకొని బాత్రూంకి వెళ్తే అది చాలా కష్టం.. 9 గజాల చీర కట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది.

ఈ చీర కట్టుకుంటే అది రాయల్ లుక్ ని ఇస్తుంది. కానీ ఇలాంటి చీర కట్టుకొని నేచర్ కాల్ కి వెళ్తే బాత్ రూమ్ కి వెళ్లడానికి చాలా ఇబ్బంది.. ఇలా చీర కట్టుకొని చాలాసార్లు బయటికి వెళ్లిన సమయంలో బాత్ రూమ్ వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. కొన్నిసార్లు ఎంతో నరకంగా అనిపించేది.. తొమ్మిది గజాల చీరలో రాయల్ లుక్ తో పాటు ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి.. అంటూ చీర కట్టుకోవడం లో ఏర్పడే ఇబ్బందిని గురించి బోల్డ్ గా మాట్లాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అనసూయ.. అయితే అనసూయ ఏ విషయాన్నైనా చాలా పచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం అంటున్నారు అనసూయ మాటలు విన్న చాలామంది నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: