టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.  సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కోట్లలో పారితోషకం తీసుకునే సమంత.. ఒకప్పుడు ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుంది. కానీ తాను సినిమాల్లోకి రాకముందు ఏం జాబ్ చేసేదో మీకు తెలుసా.. సమంత సినిమాలలోకి రాకముందు మోడలింగ్ రంగంలో పనిచేసేదట. అప్పుడు ఆమె మొదటి పారితోషకంగా రూ. 5000 తీసుకుందట. తను చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో హోస్ట్ గా చేసిందట. దానికి సమంత రూ. 5000 శాలరీగా అందుకుందట.

ఇటీవల సమంత నిర్మాతగా శుభం సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సామ్ తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.  సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది.


ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది. సమంత ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సమంతా, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: