కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్ లు సినిమాలో హీరోయిన్స్ విషయంలో బిగ్ రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు . ఒక్క హీరోయిన్ కారణంగానే సినిమా ఫ్లాప్ అయిన  సందర్భాలు సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి . అయితే మరొకసారి అలాంటి సేమ్ సిచువేషన్ రిపీట్ కాబోతుంది అంటున్నారు బాలయ్య అభిమానులు.  నందమూరి హీరో బాలయ్య ప్రజెంట్ అఖండ 2 సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాపై వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు.. అభిమానులు . కచ్చితంగా ఈ సినిమా వేరే లెవెల్ గిఫ్ట్ అందుకుంటుంది అని మరో 100 కోట్ల హిట్ బాలయ్య తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అని అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత బాలయ్యడైరెక్టర్ దర్శకత్వంలో సినిమాలో నటించబోతున్నాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది.  కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఆల్మోస్ట్ క్రిష్ దర్శకత్వంలో ఆయన సినిమాని ఫైనలైజ్ చేసేసుకున్నాడు అని క్రిష్ సినిమాలో ఆయన నటించబోతున్నాడు అని ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ కూడా తెలుగు ఇండస్ట్రీలోకి డేబ్యూ ఇవ్వబోతున్నారట . అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా హీరోయిన్ పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నారట .

పూజ హెగ్డే ప్రెసెంట్ ఎలాంటి ఫ్లాప్ సినిమాలలో నటిచ్చిందో ఎలాంటి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందో అది అందరికీ తెలుసు . మరి అలాంటి హీరోయిన్ ని బాలయ్య సినిమాలో ఎలా పెడతారు..? అంటూ నందమూరి అభిమానులు సీరియస్ అయిపోతున్నారు . మోక్షజ్ఞ కి జోడిగా శ్రీలీలని అనుకుంటున్నారట . ఇక ఈ కాంబోఎంతవరకు సెట్ అవుతుందో అర్థం కావడం లేదు అని ..క్రిష్ కొంచెం ఆలోచించి పూజని మార్చేస్తే బాగుండు అని లేకపోతే ఈ సినిమాకి కూడా ఒక శనిలా  దాపురించేసింది అంటూ ఘాటూగా స్పందిస్తున్నారు . కొంతమంది క్రిష్ చిప్ దొబ్బింది అంటున్నారు . మరి కొంతమంది మాత్రం క్రిష్ హీరోయిన్ ల సెలక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది అంటున్నారు . చూడాలి  మరి క్రిష్ ఏం చేస్తాడో..??


మరింత సమాచారం తెలుసుకోండి: