`అతడు` తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం `ఖలేజా`. అనుష్క శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. ప్రకాష్ రాజ్‌, సునీల్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు. శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ నిర్మించిన ఖలేజా మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.


2010 సెప్టెంబర్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఖలేజా మూవీ తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. `అతిథి` వంటి డిజాస్టర్ మూవీ అనంతరం దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు.. ఖలేజాతో ప్రేక్షకుల‌ను పలకరించాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని థియేటర్స్ కు వెళ్లిన ఫ్యాన్స్ మ‌రియు ఆడియెన్స్‌ సినిమా చూశాక తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. స్టోరీకి టైటిల్ కు సంబంధం లేకపోవడం, దేవుడి కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఖలేజా బొక్క బోర్లా పడింది.



కానీ ట్విస్ట్‌ ఏంటంటే.. టీవీల్లోకి వచ్చాక ఖలేజా చిత్రం ఆడియెన్స్‌ కు స్లో పాయిజన్ లా ఎక్కేసింది. ఈ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మహేష్ బాబు ఎన‌ర్జిటిక్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, అనుష్క గ్లామర్, త్రివిక్ర‌మ్ టేకింగ్‌, సాంగ్స్ కు జ‌నాలు ఫిదా అయిపోయారు. ఇప్పటికీ టీవీల్లో ఖలేజా వస్తుందంటే ప్రేక్షకులు స్క్రీన్ కు అతుక్కుపోతుంటారు. అంత‌టి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ చిత్రం. అయితే గత కొంతకాలం నుంచి తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. నేడు ఖలేజా చిత్రాన్ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చారు.
 


ఇక‌పోతే ఖ‌లేజా మూవీలో మ‌హేష్ బాబుతో తొలిసారి జ‌త‌క‌ట్టింది అనుష్క‌. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఖ‌లేజాకు ఫ‌స్ట్ ఛాయిస్ అనుష్క కాదు. మొద‌ట త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ `జల్సా` బ్యూటీ పార్వతీ మెల్టన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. కొంత షూటింగ్ లో కూడా ఆమె పాల్గొంది. కానీ ఏమైందే ఏమో స‌డెన్ గా పార్వ‌తీ మెల్డ‌న్ ఖలేజా నుంచి త‌ప్పుకుంది. దాంతో త్రివిక్ర‌మ్ మ‌రో ఆప్ష‌న్ లేకుండా అనుష్క‌ను ఎంపిక చేశారు. త‌న క్యూట్ యాక్టింగ్, గ్లామ‌ర్ తో అనుష్క బాగానే ఆక‌ట్టుకున్నా.. మ‌హేష్ కు జోడిగా ఆమె సెట్ అవ్వ‌లేద‌న్న కామెంట్స్ అప్ప‌ట్లో విన‌ప‌డ్డాయి. దాంతో ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ తో అనుష్క మ‌రే సినిమా చేయ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: