టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. మంచు మనోజ్ దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ కు సైతం రాక్షసుడు సినిమా తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేదనే సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోలు విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కిన భైరవం సినిమాతో ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
 
కథ :
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవీపురం అనే ప్రాంతంలో ఉన్న వారాహి అనే దేవాలయానికి నాగరత్నమ్మ (జయసుధ) ట్రస్టీగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆమె మరణం అనంతరం ట్రస్టీని ఎంపిక చేసే విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. దేవాలయానికి సంబంధించిన కొన్ని సమస్యల వల్ల  గజపతి( మంచు మనోజ్), వరద ( నారా రోహిత్), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ముగ్గురు మంచి స్నేహితులు కాగా ఒకానొక సమయంలో ఈ ముగ్గురు స్నేహితులలో ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
 
ఆ సమయంలో నిజం తెలిసిన శ్రీను పోలీసులకు అబద్ధం చెప్పి వరద భార్య దృష్టిలో చెడ్డవాడవుతాడు. అయితే ఈ స్నేహితుల మధ్య గొడవలకు కారణం ఏంటి? శ్రీను ఎందుకు అబద్ధం చెప్పాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ :
 
తమిళంలో పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన గరుడన్ అక్కడ పెద్ద హిట్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదు. భైరవం మూవీ రొటీమ్ మాస్ మసాలా కథాంశంతో తెరకెక్కినా ప్రేక్షకులను మాత్రం మెప్పించిందనే చెప్పాలి. ప్రధాన పాత్రధారులుగా నటించిన మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు.
 
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంది. ట్విస్టులను ఆసక్తికరంగా రివీల్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం కూడా భైరవం సినిమాకు బెనిఫిట్ గా ఉండనుంది. సాంగ్స్, బీజీఎం బాగానే ఉన్నా ప్లేస్ మెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించడం మైనస్ అని చెప్పవచ్చు.
 
మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ విభాగాలకు సంబంధించి ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు మెప్పించారు. నిర్మాత రాధా మోహన్సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.
 
బలాలు : ప్రధాన నటీనటుల నటన, ఫస్టాఫ్, ఆసక్తికర ట్విస్టులు
 
బలహీనతలు : కొన్ని రొటీన్ సన్నివేశాలు, సెకండాఫ్ లో కొన్ని సీన్లు
 
రేటింగ్ : 3.0/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: