
హీరోలంత ఇప్పటికే చాలా రకరకాల యాడ్స్ లలో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోహిన్స్ కూడా ఆల్కహాల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.బాలయ్య కూడా ఇటీవలే ఆల్కహాల్ యాడికి సంబంధించి మొదలుపెట్టారు. మ్యాన్షన్ హౌజ్ కి సంబంధించి ఫుల్ వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఇందులో బాలయ్య సింహం మీద సవారి చేస్తూ ఉండడం చాలా కొత్తగా కనిపిస్తోంది. బాలయ్యని సింహంతో పోలుస్తూ ఉంటారు అభిమానులు.. అందుకు తగ్గట్టుగానే ఈ మ్యాన్షన్ హౌజ్ యాడ్ ని చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇందులో ఒక షూటర్ వచ్చి సింహాన్ని గన్నుతో కలుద్దాం అనుకుంటున్నా సమయంలో బాలయ్య సింహం మీద సవారి చేస్తూ వచ్చి.. అన్నిటినీ లవ్ చెయ్.. ప్రేమతోనే వెల్కమ్ చేయి.. జిందగీలో ఏదైనా కొత్తగా ఓపెన్ చెయ్.. అంటూ చెప్పే మ్యాన్షన్ హౌజ్ యాడ్ ఆకట్టుకుంది. ఈ యాడికి క్షణాలలో వైరల్ గా చేస్తున్నారు బాలయ్య అభిమానులు. మొత్తానికి బాలయ్య ఒకవైపు ఓటీటి లో మరొకవైపు యాడ్లలో మరొకవైపు పొలిటికల్ పరంగా కూడా బిజీగా ఉన్నారు ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.