
ఆ తర్వాత `చెన్నకేశవరెడ్డి`, `దిల్`, ` ఠాగూర్`, `బన్నీ`, `లక్ష్మి`, `కృష్ణ`, `అదుర్స్` వంటి విజయవంతమైన చిత్రాలతో వినాయక్ భారీ స్టార్డమ్ అందుకున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, రవితేజ, వెంకటేష్, రామ్ చరణ్ వంటి హీరోలకు హిట్స్ అందించిన ట్రాక్ రికార్డ్ వినాయక్ సొంతం. అటువంటి డైరెక్టర్ 2018 తర్వాత హెల్త్ ఇష్యూస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. తెలుగులో ఆయన చివరిగా `ఇంటిలిజెంట్` మూవీ తీయగా.. అది డిజాస్టర్ అయింది. దాదాపు ఐదేళ్ల బ్రేక్ అనంతరం తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ `ఛత్రపతి`ని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం వి.వి వినాయక్ టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. డైరెక్టర్ భారీ ఇమేజ్ ఉన్నా.. గతంలో ఎవర్ గ్రీన్ సినిమాలు చేసినా.. లాంగ్ గ్యాప్ రావడం, సరైన హిట్ పడి చాలా కావడం అవ్వడంతో టాలీవుడ్ టాప్ హీరోలెవ్వరూ వినాయక్ తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తి చూపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన యువ హీరోలను అప్రోచ్ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ లైన్ లోకి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రీసెంట్ గా సిద్ధూకు వినాయక్ ఒక కథ చెప్పగా.. అది హీరోకు బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని.. అన్ని కుదిరితే వినాయక్, సిద్ధూ కాంబో చిత్రం త్వరలో పట్టాలెక్కొచ్చని అంటున్నారు.