మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఇలియానా తన అందంతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఆ తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇక తెలుగులో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈమె తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ సినిమాల్లో నటించడం పై అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ఎన్నో హిందీ సినిమాలలో నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన రైడ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అజయ్ దేవగన్ హీరోగా రైడ్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ లో ఇలియానా హీరోయిన్గా నటించలేదు.

దానితో ఇలియానా ఎందుకు రైడ్ 2 మూవీలో హీరోయిన్గా నటించలేదు అనే ప్రశ్నలు జనాల్లో రేకెత్తయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇలియానా తాను రైడ్ 2 మూవీలో ఎందుకు నటించలేదు అనే విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇలియానా తాజాగా సోషల్ మీడియా వేదికగా ... అజయ్ దేవగన్ తో నటించాలని ఉంది. రైడ్ 2 మూవీ సమయంలో నాకు బాబు పుట్టడంతో నేను సినిమా చేయలేకపోయాను. అలాగే ప్రస్తుతం సినిమాలను ఎంతో మిస్ అవుతున్నాను. భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ నేను రీ ఎంట్రీ ఇస్తాను అని ఇలియానా తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: