డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటింగ్ అప్డేట్ రానే వచ్చింది. `ది రాజా సాబ్‌` రిలీజ్ డేట్ లాక్ అయింది. టీజ‌ర్ అప్డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హార‌ర్ కామెడీ ఫిల్మ్ లో ప్ర‌భాస్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, సుశాంత్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.


గ‌త ఏడాది ప‌ట్టాలెక్కిన రాజా సాబ్‌.. ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అయితే తాజాగా మేక‌ర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2025 డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్ గా ది రాజ్ సాబ్ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అలాగే జూన్ 16వ తేదీ ఉద‌యం 10 గంట‌ల 52 నిమిషాల‌కు టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ను కూడా వ‌దిలారు.
ఈ తాజా పోస్ట‌ర్ లో ఓ ఓల్డ్ బిల్డింగ్ బ్యాక్ డ్రాప్ లో క్రేజీ లుక్ తో ప్ర‌భాస్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఓవైపు ఫైర్‌, మ‌రోవైపు క‌రెన్సీ నోట్లు ఎగిరిప‌డ‌టం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి మూవీ మేర‌క్స్ నుంచి వ‌చ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల రాజా సాబ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్‌, మారుతి కాంబోలో వ‌స్తున్న తొలి సినిమా ఇది. అలాగే ప్ర‌భాస్ త‌న కెరీర్ లో చేస్తున్న తొలి హార‌ర్ మూవీ కూడా ఇదే. ఇప్ప‌టికే రాజా సాబ్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్న టీజ‌ర్ తో ఆ అంచ‌నాలు తారా స్థాయికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: