తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి సక్సెస్లను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ మంచి విజయాలను అందుకోవడంలో అత్యంత వెనుకబడిపోయాడు. రీసెంట్ టైమ్ లో రవితేజ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే ఓ విషయంలో కూడా రవితేజ తన అభిమానులను వరుస పెట్టి డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు.

అది ఎందులో అనుకుంటున్నారా ..? సినిమాల విడుదల విషయంలో ... అసలు విషయానికి వస్తే రవితేజ కొంత కాలం క్రితం ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ని ఆ సంవత్సరం సంక్రాంతి పండుగకు కాకుండా ఆ తర్వాత వేరే సమయంలో విడుదల చేశారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా మొదట ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాలేదు.

తాజాగా రవితేజ , కిషోర్ తిరుమల కాంబో మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. దానితో ఓ వైపు రవితేజ అభిమానులు ఖుషి అవుతూ ఉంటే మరో వైపు ఈ సినిమా అయినా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా లేదా అని వారు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మాత్రం ఈ సినిమాను కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేసే విధంగా పక్కా ప్లాన్స్ వేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: