నందమూరి బాలకృష్ణ నటించిన పాన్ ఇండియా చిత్రం అఖండ 2. డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా విడుదల కాగా ఈ రోజున (డిసెంబర్ 12) థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలయ్యింది. అటు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు ,ఇండస్ట్రీకి చెందినవారు సైతం అఖండ సినిమా చూసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అలా ఇప్పుడు తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన దిల్ రాజు తన భార్య కూడా కలిసి సినిమాకి వెళ్లారు.



సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రివ్యూ చెప్పారు దిల్ రాజు.. సినిమా చాలా బాగుందని, యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని, సినిమా అంతా కూడా ఆఖండ క్యారెక్టర్ సూపర్ గా ఉందని, ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ అంటూ తెలియజేశారు దిల్ రాజు. దిల్ రాజు భార్య తేజస్వి మాట్లాడుతూ.. సినిమా అంతా సూపర్ గా ఉందని తెలియజేసింది. అయితే చాలామంది మాత్రం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెలియజేస్తున్నారు. థమన్ అందించిన బిజిఎం, సాంగ్స్ హైలెట్ గా ఉన్నాయని, బాలయ్య యాక్టింగ్ సూపర్ అంటూ చెబుతున్నారు.


వాస్తవంగా ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడి ఈ రోజున విడుదల అయింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా సోషల్ మీడియా వేదికగా వీడియోని విడుదల చేశారు. అఖండ 2 సినిమా రికార్డులు బద్దలు కోరుతుందని, సినిమా విడుదల ఆలస్యమైన బాలయ్య విజయాన్ని ఎవరు ఆపలేరు అంటూ అభిమానుల కోసం ప్రత్యేకించి మరి కొన్ని చర్యలు తీసుకొని ఎలాంటి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఇలా మొత్తానికి  అఖండ 2 సినిమాతో బాలకృష్ణ ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: