బాలీవుడ్ నటి సోనాలి బింద్రే అంటే సౌత్ ఇండస్ట్రీకి కూడా సుపరిచితురాలయిన నటి.. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే క్యాన్సర్ బారి నుండి బయటపడి మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తుంది. అయితే అలాంటి సోనాలి బింద్రే రాజకీయ నాయకుడితో రిలేషన్ లో ఉంది అంటూ రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.రీసెంట్గా ఓ కార్యక్రమంలో ఆ రాజకీయ నాయకుడితో కలిసి సోనాలి బింద్రే పాల్గొనడం.. అలాగే ఆ రాజకీయ నాయకుడు సోనాలి బింద్రే ఇద్దరు సైగలు చేసుకోవడంతో ఈ రూమర్లు తెరమీద వినిపించాయి.అయితే గతంలో ఆ రాజకీయ నాయకుడిని సోనాలి బింద్రే ప్రేమించిందని, వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని,కానీ ఆ రాజకీయ నాయకుడు కుటుంబ సభ్యులు సోనాలి బింద్రే ను పెళ్లి చేసుకోవడానికి అడ్డు చెప్పడంతో సోనాలి బింద్రేని ఆ రాజకీయ నాయకుడు వదిలి పెట్టారనే రూమర్లు వినిపించాయి.

అయితే రీసెంట్గా  ఓ కార్యక్రమంలో వీరు మళ్ళీ కలవడంతో ఈ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఆ రాజకీయ నాయకుడితో ఉన్న రిలేషన్ గురించి వచ్చిన వార్తలపై అసహనం వ్యక్తం చేసింది సోనాలి బింద్రే.ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..రాజ్ థాక్రేతో నాకు రిలేషన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే నేను ఇలాంటి రూమర్లను ఎక్కువగా పట్టించుకోను. ఇవి నా దాకా కూడా రాలేదు.ఆ ప్రచారం జరిగిన విషయం కూడా నాకు తెలియదు.. నాకు రాజ్ ఠాక్రేతో సంబంధం ఉందనే వార్త రావడం చాలా బాధాకరం. ఆయనతో ఆయన కుటుంబంతో మాకు చాలా రోజుల నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ్ థాక్రే  భార్య షర్మిలా, అలాగే ఆమె తల్లితో మా పిన్నికి చిన్నప్పటినుండి ఎంతో మంది స్నేహబంధం ఉంది.

అందుకే చిన్నప్పటినుండి మా రెండు ఫ్యామిలీస్ కి మధ్య ఎంతో అనుబంధం ఉండేది. అందుకే మేమిద్దరం సన్నిహితంగా కనిపించాం. అంతేకానీ మా మధ్య ఎలాంటి చెడు రిలేషన్ లేదు.సోషల్ మీడియాలో వచ్చే ఈ నెగటివ్ వార్తలు చాలా బాధాకరం.. చిన్నప్పటినుండి మా రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న సంబంధం అలాగే  కొనసాగుతుంది.కానీ ఇలాంటి చెడు వార్తలు రావడం మాత్రం చాలా బాధాకరం అంటూ రాజ్ థాక్రేతో తనకి సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలపై అసహనం వ్యక్తం చేసింది సోనాలి బింద్రే.. ఇక సోనాలి బింద్రే రాజకీయ రంగ ప్రవేశం గురించి అదే ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా.. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. ఎప్పటికీ రాను కూడా.. రాజకీయ రంగంలోకి రావాలంటే విమర్శలు, ప్రశంసలు దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి ఉండాలి.నాకు అంత ధైర్యం లేదు. అందుకే రాజకీయాల్లోకి రాను అంటూ సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: