టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, బన్నీలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ ద్వారా వ్యాపార రంగంలో సైతం సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏషియన్ గ్రూప్స్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబీ మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు సైతం హైదరాబాద్ లో ఏఏఏ మల్టీప్లెక్స్ ఉందని చెప్పవచ్చు.
 
ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ హీరోలు తమ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్ ను ఏఎంబీ పేరుతో నిర్మించగా మహేష్ బాబు చెన్నైలో సైతం భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలుస్తోంది.
 
అల్లు అర్జున్ సైతం వైజాగ్ లో ఏఏఏ మల్టీప్లెక్స్ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ మల్టీప్లెక్స్ ల నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ హైదరాబాద్ లో అతిపెద్ద ఐమ్యాక్స్ దిశగా అడుగులు వేస్తున్నారని భోగట్టా. మహేష్ బాబు, బన్నీ భారీ ప్లాన్ వేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
మహేష్ బాబు, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలను సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు, బన్నీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ హీరోలను అభిమానించే వాళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ లను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ హీరోల పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: