
ఇప్పుడు మహేశ్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ప్రెసెంట్ చెప్పుకోదగ్గ సినిమాలు అంటే ఈ రెండే. ఈ రెండు సినిమాలే బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసే సత్తా ఉన్న మూవీస్ అని చెప్పుకోక తప్పదు. పుష్ప2 సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఇండస్ట్రీకి హైప్ తెచ్చే సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం ఈ రెండు కాంబోలో తెరకెక్కే సినిమాలనే చెప్పాలి . అయితే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని టార్గెట్గా చేసి ట్రోల్ చేస్తున్నారు .
దీపిక పదుకొనేను సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవడం పట్ల అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయాన్ని వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అన్ని విషయాలలో తోపు అనుకున్నామని ఒక హీరోయిన్ ఇలా చేసింది అని తెలిసి నాకు కూడా ఆయన తన సినిమాలు దీపికాని హీరోయిన్గా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ ..?? అంటూ కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . సందీప్ రెడ్డి వంగ- దీపిక ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. 35 రోజులకు కాల్ షీట్ కోసం 25 కోట్లు డిమాండ్ చేసింది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది మరి అలాంటి హీరోయిన్ సినిమాలో ఎలా పెట్టుకుంటాం..? అంటూ కావాలని మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు చరణ్ ఫాన్స్ బన్నీపై పడి ఏడ్చారు ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ కూడానా ..? అంటూ బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ - దీపిక పదుకొనే ని హీరోయిన్గా చూస్ చేసుకోవడం పట్ల రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..!