మంచు మనోజ్ కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం చేయించారని మంచు విష్ణు వర్గం ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు విష్ణు దీనిపై స్వయంగా మాట్లాడి మనోజ్ దగ్గర పనిచేసే వాళ్ళే ఈ పని చేశారని,అది మనోజ్ కి కూడా తెలుసు అని సైలెంట్ గా ఇచ్చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా మాట్లాడారు. దీంతో మనోజ్ నిజంగానే దొంగ అని కొంతమంది అనుకుంటే మరి కొంతమందేమో విష్ణు కావాలనే తన సినిమాకి ప్రమోషన్ కోసం ఇలా మనోజ్ పై దొంగతనం ఆరోపణ చేస్తున్నారని అంటున్నారు. ఇక మరికొంతమందేమో విష్ణునే తన ఆఫీసులో పనిచేసే వారికి అలా చేయమని చెప్పి ఏమీ తెలియనట్టు కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు.కానీ నా దొంగతనానికి మాత్రం మోహన్ బాబే సహాయం చేశారు అంటూ ఒక షాకింగ్ సీక్రెట్ ని బయటపెట్టారు మంచు మనోజ్.

దీంతో చాలా మంది నెటిజన్లు కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం మోహన్ బాబే  దగ్గరుండి మనోజ్ తో చేయించారని మాట్లాడుకుంటున్నారు.అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ గురించి మనోజ్ మాట్లాడారనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే మనోజ్ దొంగతనం గురించి మాట్లాడింది కన్నప్ప హార్డ్ డిస్క్ గురించి అయితే కాదు.. ఆయన చిన్న తనంలో చేసిన దొంగతనాల గురించి.. అయితే చిన్నతనంలో చాలామంది పిల్లలు నాన్న జేబులో నుండి అమ్మ పర్సులో నుండి పోపుల డబ్బాల నుండి డబ్బులు ఎత్తుకెళ్లి ఇష్టమైనవి కొనుక్కొని తింటూ చిన్నచిన్న దొంగతనాలు చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ అనుభవం అందరికీ ఉంది. అలా మనోజ్ కి కూడా ఇలాంటి ఓ అనుభవం ఉందట. ముఖ్యంగా తన తల్లి పర్సులో ఉన్న డబ్బుని చాలాసార్లు మనోజ్ తెలియకుండా కొట్టేసారట.

అయితే ఇలా తల్లి పర్సులో నుండి డబ్బు కొట్టేసే టైం లో తన తండ్రి మోహన్ బాబే సహాయం చేసే వారట.తల్లి పర్సులో నుండి కొంత అమౌంట్ మోహన్ బాబు తీసుకొని ఆ తర్వాత మిగిలింది మనోజ్ కి ఇచ్చేవారట. ఇక మనోజ్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడని తెలిసాక మంచు లక్ష్మి,మనోజ్ తల్లి నిర్మలా దేవి ఇద్దరు కూడా పదే పదే పర్సులో పెట్టుకున్న డబ్బులను చెక్ చేసుకుంటూ ఉండేవారట.అయితే ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ తన భైరవం మూవీ ప్రమోషన్స్లో బయటపెట్టారు. అలా చిన్నతనంలో తన దొంగతనాలకు తండ్రి సహాయం చేశారు అంటూ మోహన్ బాబు గురించి అసలు విషయం బయట పెట్టేశారు మంచు మనోజ్. ఇక మంచు మనోజ్ ని చాలా రోజుల నుండి మంచు ఫ్యామిలీ వెలివేసిన సంగతి మనకు తెలిసిందే.ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చెప్పనక్కర్లేదు.ఇక మనోజ్ తో కేవలం లక్ష్మీ తప్ప ఎవరూ కూడా మాట్లాడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: