
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజుల టైం ఉంది .. కానీ ఇంకా ఒక సాంగ్ కూడా కంప్లీట్ కాలేదు , అలాగే రీ రికార్డింగ్ కూడా పూర్తి కాలేదు .. ఇక ఇదే విషయాన్ని స్వయంగా నిర్మాత ఏషియన్ సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. ఇక మరో మూడు రోజుల్లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ రిలీజ్ చేయాల్సి ఉంది .. ఆ తర్వాత మరో రెండు రోజులకు మరో సాంగ్ రిలీజ్ చేస్తారట .. దేవిశ్రీ కారణంగా ఎప్పుడు సినిమాకు లాస్ట్ మినిట్ టెన్షన్ ఏర్పడినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు ..
అలాగే శేఖర్ కమ్ముల తన టీం తో కలిసి సినిమాకు సంబంధించిన పెండింగ్ వర్క్ ను పూర్తి చేయడానికి తన శక్తికి మించి పనిచేస్తున్నాడు .. అలాగే ఇప్పుడిప్పుడే సినిమా పై బజ్ పెరుగుతుంది ... అయితే దేవిశ్రీ తన అవుట్ పుట్ ఇచ్చేవరకు సినిమా విషయం లో కాస్త టెన్షన్ తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు .. ఎందుకంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో సంగీత దర్శకులు రీ రికార్డింగ్ లేట్ చేయడం తో కొన్నిసార్లు సినిమాలు వాయిదా పడాల్సి వస్తున్నాయి .. ఈ క్రమంలో కుబేర విషయం లో దేవి శ్రీ ఏం చేస్తాడో చూడాలి ..