నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా షేక్ అయ్యింది. ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా బాల‌య్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అయితే ఓ మెసేజ్ మాత్రం సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.. బాగా వైర‌ల్ అయ్యింది. ఆ మెసేజ్ బాల‌య్య బాబు వ్య‌క్తిత్వం ఎంత గొప్ప‌దో చాటి చెప్పింది. ఆ మెసేజ్ ఇలా ఉంది..


పరమవీరచక్ర తీశాడని దాసరిని,
పాండురంగడు ఫ్లాప్ అని రాఘవేంద్ర రావు నీ నిందించలేదు.
వీరభద్ర ఫ్లాప్ అయింది అని రవికుమార్ చౌదరి కెరీర్ అంతం చెయ్యలేదు,
విజయేంద్ర వర్మ తీసినందుకు స్వర్ణ సుబ్బారావుని బలిపశువు ని నీ చెయ్యలేదు,
ఒక్క మగాడు పోయిందని వైవీఎస్ చౌదరి నీ దూరం పెట్టలేదు.
చెప్పుకుంటూ పోతే…
ఫ్లాప్ లిస్ట్ లో ఉన్న పీ.వాసు, కే ఎస్ రవికుమార్, క్రిష్ , జయంత్ సీ పరాన్జి వంటి డైరెక్టర్ ల గురించి బహిరంగంగా ఏనాడూ ఒక్క చిన్న మాట తూలలేదు.
పై పెచ్చు ఆ సినిమాల  అపజయాన్ని అందరి కన్నా ఎక్కువ తానే మోశాడు.
Paid PR టీముల ని పెట్టుకుని, రివ్యూవర్లను మ్యానేజ్ చేసి,పోయిన సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ల ఖాతాలో,
హిట్లని తన సొంత విజయంగా ఏనాడూ ప్రదర్శించుకోలేదు.


దర్శకుల పని లో వేలెట్టి కెలికేసి సొంత ఇన్ పుట్ లు, వెకిలి సలహాలు ఇచ్చేసి ఏనాడూ ఎవరితో మాట పడలేదు.
దర్శకుడే అన్నిటికీ ఆద్యుడు, “He is captain of the ship”అని నమ్మే సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు లో థియేటర్ ల తాపు లేపిన ట్రైన్ సీన్ ల ను "బీ గోపాల్ గారు నా నుండి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురాగలరు" అన్నా,  
అదే బీ గోపాల్ గారు దర్శకత్వం వహించిన పలనాటి బ్రహ్మనాయుడు లో ట్రోల్ అయిన ట్రైన్ సీన్ లను ప్రస్తావిస్తూ "ఎందుకు చేశానో నాకే తెలీదు, అసలు తొడ గొడిటే ట్రైన్ వెళ్లిపోవడం ఏమిటి,
చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది" అని నవ్వుతూ వదిలేసినా బాలయ్య కే చెల్లింది.


అందుకే అంత స్వచ్ఛంగా తన మీద సోషల్ మీడియా లో వెకిలి కామెడీ లు చేసుకుని బతికే ఎందరికో పరోక్షంగా తిండి పెడుతూ, కుల మత ప్రాంతాల కతీతంగా క్యాన్సర్ కారణంగా అంధకారం నింపుకున్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ , సినీ వినీలాకాశంలో ధృవ తారగా,రాజకీయ రణరంగం లో ఓటమి ఎరుగని యోధునిగా నిలిచిపోయాడు. అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా “జై బాలయ్య"


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: