
టాలీవుడ్ లో ఆయన సీనియర్ హీరో .. సీనియర్ హీరోలు చాలా క్రమశిక్షణతో ఉంటారు అన్న పేరు ఉంది. షూటింగ్ కు ఆలస్యంగా రావటాలు ... చివరి నిమిషంలో నో చెప్పటాలు లాంటివి ఉండవు. వాళ్లు నిర్మాతల శ్రేయస్సు కోరి ఎన్ని గంటలైనా ఓపికగా పనిచేస్తారు. అయితే ఓ సినిమా విషయంలో ఎందుకో సీనియర్ హీరో నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు సీనియర్ హీరో భారీ సినిమా ఓకే చేశారు. చాలామంది కాంబినేషన్ . . . మంచి పేమెంట్ అంతా బాగానే ఉంది. ఎక్కువ భాగం షూటింగ్ లోకల్ గా కాదు . . ఇదే టైంలో హీరోకు వేరే వేరే పనులు రావడంతో పదేపదే షూటింగ్‌కు క్యాన్సిల్ కొట్టారట.
అలాగే షూటింగ్ కు రావాలంటే చార్టర్ ఫ్లయిట్లు పెట్టాలని కూడా నిర్మాతను కోరడంతో నిర్మాతకు భారీగా చేతి చమురు కూడా వదిలిందట. ఇక కీలకమైన కాంబినేషన్లు ఉన్న షెడ్యూల్స్ ఆ హీరో కోసం క్యాన్సిల్ చేసుకోవాల్సి రావడంతో మళ్లీ అవి సెట్ చేసేందుకు .. మిగిలిన ఆర్టిస్టుల కోసం అదనపు డేట్లు తీసుకున్నందుకు అదనపు రెమ్యునరేషన్లు కూడా ఇచ్చు కోవాల్సి వచ్చిందట. మొత్తానికి షూటింగ్ ముగిసినా సదరు సీనియర్ హీరో తీరు వల్ల నిర్మాత ఎంతో ఆవేదనకు గురయ్యారట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు