ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కృతి శెట్టి.. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవడంతో ఈ అమ్మడు లక్ బాగా కలిసి వచ్చిందని అనుకున్నారు.. కానీ మూడు సినిమాల సక్సెస్ తరువాత డబుల్ ఫ్లాపులతో నిరాశపరిచింది. చివరిగా శర్వానంద్ తో కలిసి మనమే అనే చిత్రంలో నటించింది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ప్రయత్నాలు చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ రెండు మూడు చిత్రాలు చేసింది.


మలయాళం లో కూడా కృతి శెట్టి ఏఆర్ఎం అనే చిత్రంలో నటించిన పరవాలేదు అనిపించుకుంది. సినిమాలు లేక ఈ అమ్మడు ఈ మధ్య పలు రకాల ఫోటో షూట్లతో బిజీగా గడిపేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట గ్లామర్ షో విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ ఈ మధ్యకాలంలో స్లీవ్ లెస్ ఫోజులతో బాగానే కిక్కిస్తోంది. టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయినా సరే తెలుగు సినీ పరిశ్రమ మీద ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను వదలలేకపోతున్నట్లు కనిపిస్తోంది కృతి శెట్టి. ఏదైనా చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా వదులుకోకూడదని చూస్తోంది.


ఉప్పెన చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్న కృతి శెట్టి.. మళ్లీ అలాంటి తరహా పాత్రలలో కనిపించలేదు. ఒకవేళ సక్సెస్ రావాలి అంటే మళ్ళీ అలాంటి తరహా పాత్రలోనే వస్తే కృతి శెట్టి సినిమా కెరియర్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి అలాంటి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరా అన్నది చూడాలి మరి. ప్రస్తుతం తమిళంలో అయితే వరుస సినిమాల చేస్తూ సక్సెస్ అవుతున్న కృతి శెట్టి అక్కడ బిజీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. కానీ కృతి శెట్టి మాత్రం టాలీవుడ్ వైపుగానే ఎక్కువ లైక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: