టాలీవుడ్ నటుడు మంచు విష్ణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లే దు . ఈయన నటుడి గా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది . ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని సినిమా లు మంచి విజయా లను కూడా అందుకున్నాయి . ఇది ఇలా ఉంటే తాజా గా మంచు విష్ణు "కన్నప్ప" అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ , మోహన్ బాబు , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ లాంటి ఎంతో మంది అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీ నటులు నటించారు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు ఓ రీమిక్ సినిమా హక్కులను పొందాలి అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం మలయాళ నటుడు ఫాహాధ్ ఫాజల్ "ఆవేశం" అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా మంచు విష్ణు "ఆవేశం" సినిమా గురించి మాట్లాడుతూ ... ఆవేశం సినిమాలో పహద్ ఫాసిల్ నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమా తెలుగు వెర్షన్ రీమేక్ హక్కులు పొందాలి అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు. అలాగే ఇప్పటికే ఆ సినిమా యొక్క తెలుగు వర్షన్ రీమేక్ హక్కులను మరొకరు తీసుకున్నారు అని కూడా ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: