కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అవడానికి తమిళ హీరో అయినా కూడా ఆయన సినిమాలు రీసెంట్గా తమిళ వెర్షన్ కంటే తెలుగులోనే బాగా కలెక్షన్లు రాణించడం విశేషం .. ఇదే క్రమంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తో అయ‌న‌ చేసిన సార్ సినిమాకి తమిళ్ వెర్షన్ కి కంటే తెలుగులోనే అత్యధిక కలెక్షన్లు రాగా ఇప్పుడు ఏకంగా తెలుగు స్టార్‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో చేస్తున్న కుబేర కి కూడా ఇదే రిపీట్ కాబోతుంది .. ప్రధానంగా యుఎస్ మార్కెట్లో తెలుగు వసూళ్లు తమిళ్ కంటే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి .. నార్త్ అమెరికా లో ఇప్పటివరకు తమిళ్ వెర్షన్ కి లక్ష డాలర్స్ గ్రాస్ కూడా దాటలేదు .. కానీ తెలుగు వర్షన్ కి మాత్రం 3 లక్షల 27 వేల డాలర్స్ కి పైగా కలెక్షన్లు వచ్చాయి ..


ఇక దీంతో నాలుగు లక్షలకి పైగా డాలర్స్ తో కుబేర టాలీవుడ్ వసూళ్లును నమోదు చేసింది .. ఇక మరి ఈ తమిళ్ వెర్షన్ కంటే తెలుగు లోనే అత్యధిక కలెక్షన్ రావటం అనేది తమిళ సినిమా దగ్గర తెలుగు డామినేషన్ ఎలా ఉండేదో కచ్చితంగా అర్థం చేసుకోవచ్చు .. ఇప్పటికే ఈ సినిమా మొదటి షోలు పడగా టాక్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది .. ప్రధానంగా ఈ సినిమా లో ధనుష్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించిందని .. మరోసారి ధనుష్ తన నటనతో మరో మెట్టు ఎక్కడాని  కూడా అంటున్నారు .. అలాగే నాగార్జున , రష్మిక క్యారెక్టర్లు కూడా సినిమా కు తగ్గట్టు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి .. ఇక మరి ఈ సినిమాతో ధనుష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ల‌ సునామీ క్రియేట్ చేస్తారో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: