మలయాళ సినిమా మూవీ ద్వారా అనుపమ పరమేశ్వరన్ మంచి విజయాన్ని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె మలయాళ సినిమాలలో నటించడం కంటే కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం వల్ల ఈమెకు ఆ తర్వాత వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. ఇక ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. అనుపమ ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటున్న స్టార్ హీరోయిన్ స్థాయికి మాత్రం ఎదగలేక పోయింది. ఈమె తన కెరియర్లో కొన్ని మంచి సినిమాలను మిస్ చేసుకుంది. ఆ సినిమాలను గనుక ఈ బ్యూటీ చేసి ఉండుంటే ఈమె ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఉండేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి అనుపమ రిజెక్ట్ చేసిన ఆ మూవీలు ఏవి అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నేను లోకల్ అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదట కీర్తి సురేష్ స్తానంలో అనుపమ ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఈమె ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం మూవీ ఏ స్థాయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించింది. మొదట సమంత స్థానంలో అనుపమ ను ఈ మూవీలో హీరోయిన్గా అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను కాకుండా సమంత ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. ఈ రెండు సినిమాలు కనుక అనుపమ చేసి ఉంటే ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉండేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: