
అలా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ ఉంది .సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా అభిమానుల కోసం స్పెషల్గా యోగ వీడియోను కూడా షేర్ చేసింది మీనాక్షి చౌదరి. యోగా చేస్తున్న వీడియోలతో పాటు అలాగే స్విమ్మింగ్ చేస్తూ ఉన్న వీడియోని కూడా షేర్ చేసింది. యోగ మీద అవగాహన ఉండడం చాలా మంచిది అంటూ యోగా డే సందర్భంగా అభిమానులకు తెలియజేసింది మీనాక్షి చౌదరి.
ఇక ఈ వీడియోకి నా ప్రతి సర్వ్, ప్రతి స్ట్రోక్ , ప్రతి శ్వాస బ్యాలెన్స్ తోనే మొదలవుతుందని తెలుపుతూ నీటిలాగా ప్రవహించండి, గాలిలా కదలండి ,నిప్పుల మండలి అంటూ రాసుకుంది. యోగాను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మీ జీవితం హ్యాపీగా ఉంటుంది అంటే తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. చాలామంది సెలబ్రిటీలు యోగ డే వీడియోలను షేర్ చేసినప్పటికీ కూడా ఎందుకో మీనాక్షి చౌదరి షేర్ చేసిన యోగా డే వీడియో మాత్రం చాలా స్పెషల్ గా ఆకట్టుకునేలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.