తాజాగా విడుదలైన కుబేర మూవీ బాక్సాఫీస్ కి ఊపిరి పోసింది.చాలా రోజులుగా సినిమాలు సరిగ్గా ఆడక వెల వెలబోతున్న థియేటర్లన్ని కుబేర మూవీ వల్ల హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకొని థియేటర్ ఓనర్లు సంబరపడిపోతున్నారు. ఒకరకంగా కుబేర మూవీ వాడిపోయిన థియేటర్ ఓనర్ల మొహాల్లో వెలుగును నింపిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి కుబేర మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఏదైనా సినిమా విడుదలయితే అందులో నటించిన నటినటులు కొత్తవాళ్లు ఎవరైనా ఉంటే వారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి చాలామంది జనాలు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా విడుదలైన కుబేర మూవీ విలన్ గురించి తెలుసుకోవడానికి కూడా జనాలు అంతే ఆరాటపడుతున్నారు. 

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో హీరో పాత్రలో ధనుష్ సిఐడి ఆఫీసర్గా నాగార్జున చేశారు. అయితే ఇందులో చేసిన ఆర్టిస్ట్ లు అందరూ సుపరిచితులే. కానీ విలన్ పాత్రలో బిలీయనర్ గా చేసిన జిమ్ సర్బ్ తప్పా.. ఎందుకంటే ఈయన ఇప్పటివరకు దక్షిణాదిలో ఏ సినిమాలో కూడా నటించలేదు.. దీంతో కుబేర మూవీలో నటించిన విలన్ ఎవరు అని చాలామంది వెతికే పనిలో పడ్డారు.ఇక జిమ్ సర్బ్ ఎవరో కాదు ఆయన కూడా ప్రముఖ నటుడే. అయితే దక్షిణాదిలో ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. కుబేర మూవీ తోనే ఎంట్రీ ఇచ్చారు. కానీ బాలీవుడ్లో మాత్రం పద్మావత్, నీర్జా, గంగుబాయి కతీయవాడి వంటి సినిమాలు చేశారు. అలాగే పలు వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా జిమ్ సర్బ్ నటించారు.

అయితే ఈయనది ఇండియానే అయినప్పటికీ తండ్రి ఉద్యోగం కారణంగా విదేశాలకు వెళ్లడంతో ఆయన కూడా విదేశాలకు వెళ్లి అక్కడే చాలా రోజులు ఉన్నారు. ఆ తర్వాత చదువులు పూర్తయ్యాక తిరిగి భారతదేశానికి వచ్చి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసిన జిమ్ సర్బ్ ప్రస్తుతం కుబేర మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమాలో జిమ్ సర్బ్ పాత్ర అందరిని ఆకట్టుకోవడంతో ఈయనకు దక్షిణాదిలో మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.ఇక చూడ్డానికి 60 ఏళ్లు ఉన్న వ్యక్తిలా కనిపించినప్పటికీ జిమ్ సర్బ్ కి కేవలం 37 ఏళ్లు మాత్రమే. కానీ ఆయన చూడ్డానికి కాస్త ఏజ్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: