ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎంత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో చూస్తూనే ఉన్నాం.  ప్రముఖ స్టార్ హీరోస్ .. డైరెక్టర్స్ పేర్లు కూడా డ్రగ్స్ ఇష్యూలో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.  ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన అందరివేళ్ళు ముందు సినిమా సెలబ్రిటీలపై చూపిస్తూ ఉండడం ఇంకా ఇంకా చర్చనీయాంసంగా మారిపోయింది . గతంలో అనేకసార్లు చిత్ర పరిశ్రమంలో మాదకద్రవ్యాల ఉద్ధాంతాలు సంచలనం  సృష్టించాయి.  అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు ఇప్పుడు దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైపోయారు.


మరీ ముఖ్యంగా మలయాళీ ఇండస్ట్రీలో ప్రముఖ డాక్టర్లపై డ్రగ్స్ ఆరోపణలు ఎప్పటినుంచో వస్తున్నాయి . కొంతమంది హీరోలు నటీనటులు డ్రగ్స్  తీసుకొని షూటింగ్ కి వస్తారని .. సెట్స్ లో మత్తు పదార్థాలను తీసుకుంటారు అని కొంతమంది హీరోయిన్స్ బహిరంగంగానే ఆరోపదలు చేయడం సినీ పరిశ్రమ షాకు గురయ్యేలా చేసింది.  డ్రగ్స్  వినియోగిస్తున్నారని ఆరోపణలతో గతంలో దసరా సినిమాలో నటించిన విలన్ షైన్‌ టామ్‌ చాకో, మలయాళ డైరెక్టర్స్ ఖలీద్‌ రెహమాన్‌, అష్రఫ్ హంజా లు  ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది అందరికీ తెలుసు.



ఈ నేపథ్యంలోని మలయాళ చిత్ర పరిశ్రమ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండస్ట్రీకి ఎలాంటి తప్పుడు పేరు రాకూడదు అని కఠిన నిర్ణయాన్ని తీసుకొచ్చింది . ఇకపై సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే సినిమాకి ఓకే చేసినప్పుడు అగ్రిమెంట్ పై  సైన్ చేస్తున్నప్పుడు అందులో మరొక కొత్త పేపర్ ని కూడా యాడ్  చేయబోతుంది . ఇకపై మలయాళీ ఇండస్ట్రీలో  ఎవ్వరైనా సినిమాకి సైన్ చేసేటప్పుడు ..  సెట్స్‌లో డ్రగ్స్‌ వినియోగించం అనే ఒక కొత్త అఫిడవిట్‌పై సైన్ చేయాలి. అప్పుడే  ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారట .



అది నటీనటులు కావచ్చు .. సాంకేతిక నిపుణులు కావచ్చు .. హీరో - హీరోయిన్ - డైరెక్టర్ ఎవరైనా సరే ఈ కండిషన్ కి తప్పకుండా ఒప్పుకొని పేపర్ పై సైన్ చేయాల్సిందే .  దానికి అంగీకరిస్తేనే షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టించేలా కొత్త రూల్ తీసుకువస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు . మళయాళి అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా  పెట్టిన రూల్ ప్రకారం ఎంత పెద్ద హీరో అయినా సరే ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ట్ అయిన సరే సినిమాకి ఒప్పుకోవాలి అంటే కచ్చితంగా డ్రగ్స్ తీసుకోము అంటూ పేపర్ పై సైన్ చేయాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: