టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో ఆర్జే కాజల్ ఒకరు. ఆర్జేగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది. 2025 సంవత్సరం తనకెంతో స్పెషల్ అని ఆమె చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో సీజన్ కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్ ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. తన భర్త విజయ్ శీలంశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

నా విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆర్జే కాజల్  వెల్లడించారు.  నువ్వు లేకుండా ఈ లైఫ్ ఉహించుకోలేనని   ఆర్జే   కాజల్ చెప్పుకొచ్చారు.  2025 సంవత్సరానికి  నా మనసులో ప్రత్యేక స్థానం ఉందని ఆమె అన్నారు.  ఈ సంవత్సరం మన లైఫ్ లో కీలకమైన మైలురాయి అయిన  సొంతింటి కలను  నెరవేర్చుకున్నామని  ఆమె చెప్పుకొచ్చారు.  ఇంకా మనం ఆ ఇంటికి షిఫ్ట్ కాలేదని అయినప్పటికీ   మనిద్దరం ఆ ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడేవాళ్లమని ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటే సంతోషంగా అనిపిస్తుందని ఆమె  పేర్కొన్నారు. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్ళం కాదని ఆమె కామెంట్లు చేసారు.  

ఇంటీరియర్స్ గురించి, సమయపాలన గురించి కొన్నిసార్లు అయితే అనవసర  విషయాల గురించి గొడవపడే వాళ్ళమని ఆమె వెల్లడించారు. రోజులో ఎన్ని గొడవలు అయినా రాత్రి అయ్యేసరికి వాటిని పరిష్కరించుకునేవాళ్ళమని ఆమె అన్నారు. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవ పెద్దది కాదని అనిపించేదని ఆమె పేర్కొన్నారు. మరికొన్ని సందర్భాల్లో పిచ్చివాళ్ళలా నవ్వుకునే వాళ్ళమని ఒకరి కాళ్లు మరొకరం పట్టుకుని లాగే వాళ్ళమని కొట్టుకొని అంతలోనే కలిసిపోయేవాళ్ళమని ఆమె అన్నారు. మన బంధాన్ని మరింత దృఢంగా నిర్మించుకున్నామని నువ్వు లేని జీవితం అనే ఆలోచన సైతం నా దరిదాపుల్లోకి రానివ్వనని ఆమె కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: