ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం విధించడంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనిస్ మాట్లాడుతూ.. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదంటూ తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రభావితమైన వ్యక్తిగతంగా వివాదాలను ఎదుర్కొన్న తల్లితండ్రుల కోరిక మేరకే ఇలాంటి మార్పు తీసుకుందని తెలియజేశారు. సోషల్ మీడియా వల్ల చాలామంది తల్లిదండ్రులకు శోకం అనుభవించకూడదని వాళ్లే ఈ చట్టాన్ని తీసుకురావాలని తల్లితండ్రులు కోరారని తెలియజేశారు. తల్లిదండ్రుల కోరికను గౌరవిస్తూ సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేల చట్టాలను అమలు చేశామంటూ పేర్కొన్నారు.
అయితే ఈ చట్టంలో లోపాలు ఉన్నప్పటికీ ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని చెబుతున్నారు. ఈమెరకు పిల్లల భద్రతకు కూడా అవసరమైన విధంగా అడుగులు వేస్తున్నామంటూ తెలిపారు ఆస్ట్రేలియా ప్రధాని. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఇన్స్టా, ఫేస్బుక్, x, స్నాప్ చాట్, యూట్యూబ్, టిక్ టాక్ లాంటి ఫ్లాట్ ఫార్ములను 16 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం విధించాబోతున్నారు. ఈ నిబంధనలు పాటించని సోషల్ మీడియా సంస్థలకు(మన కరెన్సీ ప్రకారం 4500 కోట్లు) భారీ జరిమానా విధించబోతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా పిల్లల మెంటల్ హెల్త్ , ఆన్లైన్ వేధింపులు, హానికరమైన కంటెంట్, మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని వాటన్నిటికీ దూరంగా ఉంచి.. స్కూలు, పిల్లల ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటివి అందించాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి