టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాను జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుంది లభించింది.

మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన ఈ సినిమా బడ్జెట్ గురించి కాస్త ఓపెన్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విష్ణు కి ఈ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది. మీరు ఈ సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయినట్లు ఉంది కదా అనే ప్రశ్న ఎదురయింది. దానికి విష్ణు సమాధానం చెబుతూ ... ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది అనేది నేను చెప్పను. 

కాకపోతే ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రం అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యంత భారీ VFX  సన్నివేశాలు ఉన్నాయి. దానితో మేము చేసిన మిస్టేక్ ఓ వల్ల ఈ సినిమాలోని VFX సన్నివేశాలకు 10 నుండి 15 కోట్ల వరకు వేస్టేజ్ అయింది. అది చాలా కాస్ట్లీ మిస్టేక్ , ఆ మిస్టేక్ చేసి ఉండకపోతే బాగుండేది. మీకు ఈ సినిమా బడ్జెట్ తో సంబంధం లేదు. మీకు సినిమా చూసినప్పుడు భారీ బడ్జెట్ సినిమా చూశాము అన్న ఫీల్ కచ్చితంగా కలుగుతుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికి కన్నప్ప మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: