నాగచైతన్య దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినాలి అని కోట్లాదిమంది అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . అది సినిమాల పరంగా అదేవిధంగా ఫ్యామిలీ పరంగా . రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లని  పెళ్లి చేసుకున్నా నాగచైతన్య త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . కానీ దానికి సంబంధించి ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ వినిపించలేదు నాగ చైతన్య . అయితే సినిమాల పరంగా మాత్రం నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాడు.  యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ తన 24వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు .


టాలెంట్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాగ చైతన్య . సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బి వి ఎస్ ఎన్ ప్రసాద్సినిమా మొత్తం మిధికల్ యాక్షన్ ధ్రిల్లర్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ . అంతేకాదు నాగచైతన్య ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట.  రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది .



ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తుంది . ఇది ఇలా ఉండగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసేసాడు నాగచైతన్య అంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది . తన కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కబోతున్న మూవీ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ శివ నిర్వాణ  కి అందించారట.  శివనిర్వాణ్ దర్శకత్వంలో ఆల్రెడీ నాగచైతన్య "మజిలీ" అనే సినిమాలో నటించాడు.  ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . కాగా ఇప్పుడు మరొకసారి శివ నిర్వాణ డైరెక్షన్ లో ఆయన నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది . ఇక ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లగా దర్శకుడు..  డైలాగ్స్ పై పని చేస్తున్నాడట . చాలా ఫీల్ గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా  ఈ సినిమా తెరకెక్కబోతుందట.  ఈ సంవత్సరం చివరినాటికి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది.  దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికి  ఆల్మోస్ట్ అంతా కూడా అఫీషియల్ గా సెట్ చేసేసుకున్నారట మూవీ మేకర్స్.  నాగచైతన్య - శివ నిర్వాణ - movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇలా సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయ్. ఆల్రెడీ మజిలీ కాంబో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమా ఇంకా హిట్ అవుతుంది అంటూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు . చూద్దాం ఈ సినిమా నాగచైతన్యకి ఎలాంటి ప్లస్ మార్క్స్ దక్కిస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: