పరిస్ధితులు చూస్తుంటే సమంత టైం అసలు బాగోలేనట్టుంది . అంతా బాగుందిలే సెట్ అయిపోయింది .. రీసెంట్ గానే శుభం సినిమాతో మంచి హిట్ అందుకుంది .. ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది .. మరొకపక్క సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి అంతా రెడీ చేసుకుంటుంది .. డైరెక్టర్ రాజ్ నిడమోరు తో ప్రేమాయణం పూర్తిగా పిక్స్ వరకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోబోతున్నారు అని అనుకునే లోపే సమంతకి మరొక భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .


ఆమె చేయబోయే నెక్స్ట్ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . దర్శకద్వయం రాజ్ & డికె తెరకెక్కించే ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్న సంగతి అందరికీ తెలుసు . ఈ వెబ్ సిరీస్ పై సమంత ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కు ముందే ఆర్థిక లావాదేవీల్లో భారీ ఫ్రాడ్ జరిగినట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. దీంతో ఈ వెబ్ సిరీస్  షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ కానే కాలేదు .. అప్పుడే ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందా..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు .



రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ మేకర్స్ తో చర్చలు జరిపిందట . అయితే ఇప్పట్లో ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కడం చాలా కష్టమంటూ చేతులు ఎత్తేసిన్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇక ఈ వెబ్ సిరీస్ అటకెక్కినట్లే అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . సినీ సర్కిల్స్ లో ఇదే  టాక్ వినిపిస్తుంది.  అంతా బాగుంది అనుకున్న మూమెంట్లో  సమంతకి ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం నిజంగా బ్యాడ్ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు . ఈ వెబ్ సిరీస్‌ను తుంబాడ్ దర్శకుడు రాహి అనిల్ బర్వే డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.  కానీ మొదట్లోనే వెబ్ సిరీస్ కి మొత్తం ఆటంకాలు ఎదురయ్యాయి . ఇలాంటి ఒక ఫ్రాడ్ జరగడంతో ఇక ఈ వెబ్ సిరీస్ తెరకె క్కిస్తారా..? లేదా..? అని కూడా సందేహం వ్యక్తం అవుతున్నాయి.  కొంతమంది సమంతకి  దరిద్రం ఇలా అంటుకుంది అని వదలనే వదలను అంటుంది అని ఘాటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: