
టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ దాదాపు 5 దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ పై ఎక్కువగా ట్రోలింగ్ నడుస్తోంది. పనికట్టుకుని తమ కుటుంబంపై ట్రోలింగ్ చేస్తున్న వాళ్లందరి పైన వివిధ సెక్షన్ల కింద హీరో మంచు విష్ణు కేసులు వేశారు. వాళ్లంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం విష్ణు ఏకంగా రు. 200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓపెనింగ్ డే వసూళ్లు ఎలా ఉంటాయో అని ? విష్ణు తో పాటు టాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఇక విష్ణు అన్నా .. మంచు ఫ్యామిలీ అన్న ట్రోలింగ్ చేయడానికి ఎక్కువమంది కాచుకుని ఉంటారు. ఇలా తన సినిమాపై ట్రోలింగ్ కంట్రోల్ చెయ్యటానికి విష్ణు ముందే రెడీ అయిపోయాడు. పనికట్టుకుని సినిమాపై ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్ప ఉంటూ ప్రెస్ నోట్ ముందుగానే రిలీజ్ చేశాడు.
అయితే ఇందులో పరోక్షంగా రివ్యూలను కూడా అడ్డుకుంటామని చెప్పే ప్రయత్నం కనిపించినట్టుగా ఉందన్న చర్చలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. సినిమాపై నెగిటివ్ రివ్యూ రాకుండా విష్ణు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారా అన్న సందేహాలు ఉన్నాయి. ఇటీవల రివ్యూలు వాళ్ళ గోల బాగా ఎక్కువైంది. ఫస్ట్ షో పూర్తి అయిన వెంటనే రివ్యూ వచ్చేస్తుంది. ట్విట్టర్ రివ్యూలు .. వీడియో రివ్యూలు ... ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో చెప్పే కామెంట్లు ఇలా షరా మామూలే. వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు కన్నప్ప సినిమా సూపర్ హిట్ అవ్వాలని అందరం కోరుకుందాం.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ పైగా 200 కోట్లు ఖర్చుపెట్టి .. ప్రాణం అంతా ధారపోసి ఈ సినిమా తీశారు. సినిమా హిట్ అయితే అందరికీ హ్యాపీ. ఒక వేళ కన్నప్ప కు నిజంగానే నెగటిట్ టాక్ వస్తే ... ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే వచ్చే నెగటివ్ రివ్యూలను కన్నప్ప టీం ఎలా స్వీకరిస్తుంది ? అన్నది కూడా ఇక్కడ పాయింటే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు