గతవారం థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం `కుబేర`. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున ముఖ్యమైన పాత్రను పోషించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ డ్రామా తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిన కుబేర మూవీ ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది.
విడుదలై వారమైన కూడా కుబేర థియేటర్స్ కళకళలాడుతున్నాయి. అయితే తాజాగా కుబేర షోలో ఆపశృతి చోటు చేసుకుంది. సినిమా చూస్తుండగా జనాలపై థియేటర్ సీలింగ్ కూలింది. ఈ ఘటన తెలంగాణలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో మెహబూబాబాద్ లో ముకుంద థియేటర్‌లో నైట్ కుబేర సెకండ్ షో రన్ అవుతున్న సమయంలో సడన్ గా థియేటర్ సీలింగ్ పైకప్పు సినిమా చూస్తున్న ప్రేక్షకుల పై పడింది.
ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సీలింగ్ కింద పడటంతో థియేటర్లోని ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. గాయాలు పాలైన వారిని హాస్పిటల్ కి తరలించారు. ఇందుకు కారుకులైన థియేటర్ యాజమాన్యంపై ప్రేక్షకులు భగ్గుమన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు