
తెలంగాణలోని రాజన్న ఆలయ మెట్ల పైన పాట చిత్రీకరిస్తే యూట్యూబ్లో రికార్డులు మోతే.. ఇక్కడ ఎన్నో రకాల పాటలు చిత్రీకరించడం వల్ల భారీ సక్సెస్ అందుకున్నాయి. రాజన్న సిరిసిరి జిల్లాలో శివుడి గుడి ప్రాంతంలో పాట చిత్రీకరిస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా ఇప్పటికే చాలా పాటలు అక్కడ చిత్రీకరించి యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. శివుడి ఆశీస్సులతో అక్కడ పాటలను చిత్రీకరించడం వల్ల విజయం ఖాయమనే విశ్వాసం రోజురోజుకి పెరుగుతోంది.
ఇప్పటికీ నిరంతరం అక్కడ ఏదో ఒక పాటకు షూటింగ్ జరుగుతూనే ఉంటుందట. రాబోయే రోజుల్లో 1000 పాటల వరకు అక్కడ చిత్రీకరించే విధంగా కనిపిస్తోంది. ఈ కళాకారుల ప్రదర్శనను చూసి అక్కడ దైవ దర్శనానికి వచ్చిన భక్తులు కూడా చాలా ఆనంద పడుతూ ఉంటారు. వేములవాడ ఆధ్యాత్మిక వాటికి కేంద్రంగానే కాకుండా కళా ప్రదర్శనకు కూడా ఒక వేదికగా మారిపోయింది. మరి కొంతమంది అక్కడ చిన్న పార్ట్ షూటింగ్ చేస్తే విజయం అవుతుందని నమ్మకంతో కూడా చాలామంది వేములవాడ బాట పడుతున్నారు. ఇక అక్కడ స్థానిక కళాకారులు కూడా తమకు అవకాశం మరింత కలిగిస్తే .. మరింత ప్రోత్సహించే వారవుతారంటూ తెలియజేస్తున్నారు. వేములవాడలో షూటింగ్ జరిగిన కొన్ని జానపద పాటలు.
1).రాను.. బొంబాయి కి రాను.. ఈ పాట యూట్యూబ్లో ట్రెండీగా మారింది.
2).మంజుల.. ఓ మంజుల
3). ధన్ధనాధన్.. ధన్ధనాధన్
4). బావల్లో.. ఓ భావల్లో
5). రారా ముద్దుల బావయ్యో
6). గున్న గున్న మామిండ్లు.. ఓ రాజులు
7). నిమ్మ తోట వనంలో.. జోడు జబ్బల గొడుగు కింద.
8). చిన్న చిన్న చింతల్లో బావయ్యా..
ఇవే కాకుండా అక్కడ కొన్ని వందల పాటలు చిత్రీకరించి మంచి విజయాన్ని అందుకున్న ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి. రాజన్న గుడి తో పాటు అక్కడ ప్రకృతి అందాలు కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి ప్రతి కళాకారులకు కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 150కు పైగా పాటలు చిత్రీకరించారు.. మరో పదేళ్ల కనీసం 1000 పాటలకు పైగా చిత్రీకరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.