
ఈ మూమెంట్ కోసం మెగా అభిమానులందరూ వెయిటింగ్. కొడుకే పుట్టాలి అని కొందరు ఎవరు పుట్టిన హెల్దీగా పుట్టాలి అని మరికొందరు .. సోషల్ మీడియా వేదిక రకరకాలుగా కామెంట్ లు చేస్తూ ఉంటారు . కాగా ఇప్పుడు లావణ్య తరహాలోనే మరొక యంగ్ హీరోయిన్ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. ఈమె నటించిన సినిమాలు హిట్ అవ్వకపోయినా సరే వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది . భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే . ఈ సినిమా షూట్ లోనే వీరిద్దరూ డీప్ గా క్లోజ్ అయిపోతున్నారట . ఎంతలా అంటే ఫ్రెండ్షిప్ కాదు అంతకుమించిన రేంజ్ లోనే. రీసెంట్గా భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా రాం పెట్టిన పోస్ట్ కూడా హైలెట్ అయిన విషయం అందరికీ తెలుసు . అంతే కాదు వీళ్ళు పార్టీలకి పబ్ లకి కూడా తెగ తిరిగేస్తున్నారట. దీంతో త్వరలోనే భాగ్యశ్రీ - రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు రామ్ పోతినేని ఇలాంటి మంచి సౌండ్ పార్టీని పట్టిందే భాగ్యశ్రీ అంటూ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు కుర్రాళ్ళు . సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమాయణం హైలెట్గా మారింది . కానీ దీనిపై అటు భాగ్యశ్రీ ఇటు రాంపోతినేని ఏ విధంగా స్పందించట్లేదు . ఈ రోజుల్లో ఇలా స్పందించకుండా ఎంతోమంది ప్రేమించేసుకుంటున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు . వాళ్లలో వన్ ఆఫ్ ద కపులే లావణ్య - వరుణ్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అంటూ అభిమానులు నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!