- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో ఈ ఏడాది అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది. ఫస్ట్ ఆఫ్ లో టాలీవుడ్ కి సంక్రాంతి సమ్మర్ లాంటి రెండు కీలకమైన సీజన్లు ఉంటాయి. ఈ యేడాది ఆ రెండు సీజన్లను సరిగ్గా వాడుకోలేకపోయింది. పరిశ్రమలో భారీ అంచనాల ఉన్న సినిమాలు రాణించలేదు. అలాగని అనూహ్యమైన విజయాలు లేవు. వీటితో పాటు కొన్ని వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. జనవరి సంక్రాంతి సినిమాలతో సందడి మొదలైంది. ఆరంభంలోనే పెద్ద షాక్. రాంచరణ్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. బాలకృష్ణ డాకు మహారాజ్ డీసెంట్ విజయం అందుకుంది. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ బ్లాకు బస్టర్ కొట్టేసి సంక్రాంతి లోటు చాలావరకు భ‌ర్తీ చేశాడు.


ఫిబ్రవరిలో నాగచైతన్య తండేల్‌ ఒకటి మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రాబట్టింది. విశ్వ‌క్‌సేన్‌ లైలా డిజాస్టర్. సందీప్ కిషన్ మజాకా కూడా పార్టీ కొట్టేసింది. మార్చిలో నాని నిర్మించిన కోర్టు సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. మ్యాడ్ 2 కూడా డీసెంట్ విజయం అందుకుంది. నితిన్ - శ్రీలీల‌ రాబిన్ హుడ్ డిజాస్టర్. కిరణ్ అబ్బవరం దిల్‌రూబా ప్లాప్. ఇక ఏప్రిల్ డిజాస్టర్ నెల.. సిద్దు జొన్నలగడ్డ జాక్‌ తీవ్ర నష్టాలు మిగిల్చింది. కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్లాప్‌ అయింది. సంపత్ నంది మాజాక‌తో ప్రియదర్శి సారంగపాణి జాతకం కూడా ప్లాప్‌ అయ్యాయి.


ఇక మే నెల నాని హిట్ 3 సినిమాతో మొదలైంది. ఇది చాలా వైలెంట్ గా హిట్ కొట్టింది. శ్రీ విష్ణు సింగల్ తో మరో హిట్ కొట్టాడు. ఇక ముగ్గు రు హీరోలు చేసిన భైరవం సక్సెస్ కాలేదు. సమంత నిర్మించిన శుభం, నవీన్ చంద్ర లెవెన్‌ ఇవేవీ ప్రభావం చూపలేదు. జూన్ లో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. ధనుష్ - నాగార్జున కుబేర సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక మంచి విష్ణు కన్నప్ప సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కొనసాగుతోంది. మైత్రి నిర్మించిన ఎనిమిది వసంతాలు ప్లాప్ అయ్యింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: