ఛీ ఛీ కూతురితో సరసాలాడడమా.. ఒక తండ్రి చేయాల్సిన పనేనా..కూతురితో రొమాన్స్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. సినీ సెలబ్రిటీలను చూసే వాళ్ళ అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు. అలాంటిది ఒక బాధ్యతగల సెలబ్రిటీ స్థానంలో ఉన్న మీరు ఇలాంటి చెత్త పని చేయచ్చా అంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ని అందరూ ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకీ కూతురితో రొమాన్స్ చేయడంపై వచ్చిన ట్రోలింగ్ పై అమీర్ ఖాన్ ఏ విధంగా సమాధానం చెప్పారు..ఎందుకు అలాంటి చెత్త పని చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమీర్ ఖాన్ కూతురితో రొమాన్స్ అంటే రియల్ కూతురితో అనుకుంటే పొరపడినట్లే. రియల్ కూతురు కాదు రీల్ కూతురితో. అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ లో ఫాతిమా ఆయన పెద్ద కూతురు పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా తర్వాత తండ్రి కూతుర్లుగా కనిపించిన అమీర్ ఫాతిమా మరో సినిమాలో రొమాన్స్ చేసే పాత్రలో కనిపించారు. అయితే ఈ విషయంలో అప్పట్లో పెద్ద ఎత్తున అమీర్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించారు అమీర్ ఖాన్.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, జెనీలియా కాంబోలో వచ్చిన సితారే జమీన్ పర్ సినిమా గత నెలలో రిలీజయ్యి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ కి దంగల్ సినిమాలో తండ్రి కూతుర్లుగా చేసి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో రొమాన్స్ ఎందుకు చేశారంటూ ఓ ప్రశ్న ఎదురయ్యింది. దీని గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో హీరోయిన్గా మొదటి ఫాతిమాని ఓకే చేసాం. కానీ డైరెక్టర్ మాత్రం ఇంతకుముందు సినిమాలో తండ్రి కూతుర్లుగా చేసి ఈ సినిమాలో రొమాన్స్ చేస్తే ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్లు చేస్తారు అని చెప్పారు.

దాంతో శ్రద్ధా కపూర్,అలియా భట్,దీపికా పదుకొనే వంటి కొంతమంది హీరోయిన్ లను సంప్రదించాము.కానీ ఆ హీరోయిన్స్ ఎవరికీ కూడా సినిమా స్టోరీ నచ్చకపోవడంతో చేయమని చెప్పేశారు. దాంతో చేసేదేమీ లేక మళ్ళీ ఫాతిమనే ఓకే చేయమని చెప్పాను.అంతే కాదు డైరెక్టర్ భయపడుతుంటే నేనే ధైర్యం చెప్పి ప్రేక్షకులు ఏమైనా పిచ్చి వాళ్లా..మేం ఏమైనా రియల్ లైఫ్ లో తండ్రి కూతుర్లమా.. సినిమాలో కదా.. అది ప్రేక్షకులకు తెలుసు అని చెప్పాను. అలా మేమిద్దరం సినిమా చేయాల్సి వచ్చింది అంటూ అమీర్ ఖాన్ చెప్పారు. కానీ అమీర్ ఖాన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు డైరెక్టర్ చెప్పిందే కరెక్టు ఒక సినిమాలో తండ్రికూతుర్లు గా మరో సినిమాలో రొమాన్స్ చేస్తే తిట్టకుండా మెచ్చుకుంటారా మీరు ప్రేక్షకులను తప్పుగా అంచనా వేశారు అంటూ మండి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: