
మళ్లీ ఆ తర్వాత ఏ విధంగా అప్డేట్ ఇవ్వలేదు.జులై 7న హీరో రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆరోజున జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గాని తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.. 2024లో 40 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించి అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. మరి జై హనుమాన్ సీక్వెల్ పైన వస్తున్న చిత్రం పైన కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈసారి హనుమంతుడు గొప్పతనాన్ని వివరించే విధంగా ఈ చిత్రం ఉండబోతుందని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. వాస్తవానికి 2025 లోనే జై హనుమాన్ చిత్రం విడుదలవుతుందనుకున్నప్పటికీ.. అలా విడుదల అయ్యేలా ఇప్పుడు కనిపించడం లేదు. అలాగే కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్లో హీరో రిషబ్ శెట్టి బిజీగా ఉండడం చేత షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.